Connect with us

Hi, what are you looking for?

Uncategorized

RRR Re release: `ఆర్‌ఆర్‌ఆర్‌` ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్‌.. మరోసారి థియేటర్లోకి సంచలన మూవీ

గతేడాది మార్చి 25న విడుదలైన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ RRR మరోసారి థియేటర్లలో అడుగుపెట్టబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరిస్తున్న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్ ను కూడా విడుదల చేసి మాస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో పాటు యూఎస్ఏలోనూ మళ్లీ సందడి చేయబోతోంది. మార్చి 3న దాదాపు 200 థియేటర్ల రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ లవర్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్ఎస్ రాజమౌళి  తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచడంతో పాటు.. హాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా ప్రశసంలను అందుకుంది. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్, ఎడ్గార్ రైట్ తో పాటు మరింతకొంత మంది ప్రశంసలు కురిపించారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. దీనికి తోడు చిత్రం ప్రతిష్టాత్మకమైన అవార్డులనూ సొంతం చేసుకుంటూ హౌరా అనిపిస్తోంది. ఆస్కార్స్ బరిలో నిలవడంతో పాటు.. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను దక్కించుకుంది. ఇలా అంతర్జాతీయ వేదికపై గత ఏడాదిగా ‘ఆర్ఆర్ఆర్’పేరు మారుమోగుతూనే ఉంది.

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందించిన సెన్సేషనల్ సాంగ్ ‘నాటు నాటు’ (Naatu Naatu) ఆస్కార్స్ 2023 బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఈ సాంగ్ ఆస్కార్స్ కు నామినేట్ అయ్యింది. ఇక మార్చి 12న ఆస్కార్క్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే రామ్ చరణ్, ఎస్ఎస్ రాజమౌళి ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో RRRను మరోసారి థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. దేశవ్యాప్తంగా ప్రధాన సెంటర్లతో పాటు.. యూఎస్ఏలోనూ మంచి నెంబర్ గల థియేటర్లలోనే రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది.

ఇక తాజాగా రిలీజ్ అయిన చిత్రం యొక్క రీరిలీజ్ ట్రైలర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతోంది.  చిత్రంలోని యాక్షన్స్ సీక్వెన్స్ ను లేటెస్ట్ ట్రైలర్ లో మరింతగా చూపించడంతో రీరిలీజ్ వేళ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. డీవీవీ దానయ్య రూ.550 కోట్లతో చిత్రాన్ని తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ ఉద్యమ వీరులు అల్లూరిసీతారామరాజు, కొమురంభీం పాత్రల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్, శ్రియా సరన్ ముఖ్య పాత్రల్లో మెరిసి అలరించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

हेल्थ

महिलाओं की बायीं आँख फड़कना :- हमारे जीवन में आए दिन कोई न कोई घटना घटती रहती है। इन्हीं में से एक है आंख...

ब्लॉग

Youtube shorts video upload करने का सबसे सही समय| Best time to upload you tube shorts अगर आप सोशल मीडिया पर सफल होना चाहते...

ब्लॉग

आस-पास कहाँ-कहाँ रेस्टोरेंट मौजूद हैं- कैसे पता करें   आस-पास कहां-कहां रेस्टोरेंट मौजूद हैं और कैसे आप उन्हें खोज सकते है, इस आर्टिकल को...

हेल्थ

पेट के निचले हिस्से में दर्द के कारण क्या है?   महिला हो या पुरुष पेट में दर्द  होना एक सामान्य सी बात है...